గౌడన్నలకు గుడ్‌న్యూస్… ఇకపై వారికి 15 శాతం రిజర్వేషన్

776
cm-kcr

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని వివిధ అంశాలపై జరుగుతున్న తెలంగాణ మంత్రి మండలి సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో మద్యం దుకాణాల ఏర్పాటుకు నిర్వహించే టెండర్లలో గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే దళితులకూ రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..