- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా కాటుకు మరో రిపోర్టర్ బలి
by B.Srinivas |
<p>దిశ, కోదాడ: కరోనా మహమ్మారి జర్నలిస్టులపై పంజా విసురుతోంది. రోజుకో రిపోర్టర్‌ను పొట్టనబెట్టుకుంటూ విలయతాండవం చేస్తోంది. తాజాగా.. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన మరో రిపోర్టర్ కరోనా కాటుకు బలయ్యాడు. కోదాడ పట్టణానికి చెందిన ఓరుగంటి శ్రీనివాసరావు ప్రముఖ టీవీ ఛానల్‌లో రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల విధుల్లో భాగంగా బయటకు వెళ్లిన సమయంలో కరోనా సోకింది. దీంతో ఆయన సూర్యాపేట జిల్లా ఏరియా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందాడు. రిపోర్టర్‌గా, […]</p>

X
దిశ, కోదాడ: కరోనా మహమ్మారి జర్నలిస్టులపై పంజా విసురుతోంది. రోజుకో రిపోర్టర్‌ను పొట్టనబెట్టుకుంటూ విలయతాండవం చేస్తోంది. తాజాగా.. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన మరో రిపోర్టర్ కరోనా కాటుకు బలయ్యాడు. కోదాడ పట్టణానికి చెందిన ఓరుగంటి శ్రీనివాసరావు ప్రముఖ టీవీ ఛానల్‌లో రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల విధుల్లో భాగంగా బయటకు వెళ్లిన సమయంలో కరోనా సోకింది. దీంతో ఆయన సూర్యాపేట జిల్లా ఏరియా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందాడు. రిపోర్టర్‌గా, ఫోటోగ్రాఫర్‌గా కోదాడ పట్టణంలో శ్రీనివాసరావు చాలా సుపరిచితుడు. శ్రీనివాస రావు మృతి పట్ల జర్నలిస్టులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
Next Story






