నేత్ర దానం చేసి ‘చిరంజీవి’గా నిలిచిన రిపోర్టర్ లక్ష్మణరావు..

by Vadlamudi Anukaran |

<p>దిశ ప్రతినిధి, కరీంనగర్ : ‘దిశ’ దినపత్రికకు హుజురాబాద్ రిపోర్టర్‌గా ఉన్న లక్ష్మణ రావు గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి శనివారం తెల్లవారుజామున వరంగల్ ఎంజీఎంలో మరణించిన సంగతి తెలిసిందే. మరణం తరువాత కూడా ఆయన చిరంజీవిగా నిలిచారు. ఆయన రెండు కళ్లను దానం చేయడానికి కుటుంబసభ్యులు అంగీకరించారు. శనివారం మధ్యాహ్నం నేత్రవైద్య నిపుణులు లక్ష్మణరావు కళ్లను సేకరించారు. పత్రిక ప్రారంభం నుంచీ లక్ష్మణరావు మంచి కథనాలు అందించారు. ఆయన మృతి పట్ల [&hellip;]</p>

నేత్ర దానం చేసి ‘చిరంజీవి’గా నిలిచిన రిపోర్టర్ లక్ష్మణరావు..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ‘దిశ’ దినపత్రికకు హుజురాబాద్ రిపోర్టర్‌గా ఉన్న లక్ష్మణ రావు గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి శనివారం తెల్లవారుజామున వరంగల్ ఎంజీఎంలో మరణించిన సంగతి తెలిసిందే. మరణం తరువాత కూడా ఆయన చిరంజీవిగా నిలిచారు. ఆయన రెండు కళ్లను దానం చేయడానికి కుటుంబసభ్యులు అంగీకరించారు.

శనివారం మధ్యాహ్నం నేత్రవైద్య నిపుణులు లక్ష్మణరావు కళ్లను సేకరించారు. పత్రిక ప్రారంభం నుంచీ లక్ష్మణరావు మంచి కథనాలు అందించారు. ఆయన మృతి పట్ల ‘దిశ’ యాజమాన్యం, సిబ్బంది దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ‘దిశ’ యాజమాన్యం ఆయన కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థికసాయాన్ని ప్రకటించింది. ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది.

Next Story