మన ప్రేమ ఊపిరి పీల్చుకుంటోంది : రేణు

70

దిశ, వెబ్‌డెస్క్ : కేరాఫ్ పవన్ కల్యాణ్ అనే పేరును చెరిపేసుకుంటూ.. తన ఉనికిని, గుర్తింపును చాటుకుంటోంది రేణు దేశాయ్. నటి, నిర్మాత, దర్శకురాలు.. ఇవే కాదు, రేణుదేశాయ్‌లో వీటన్నింటికి మించిన కవితా హృదయం ఉంది. ఆమె కవితలు ఆమెలోని ఆంతరంగిక కోణాన్ని ఆవిష్కరించడమే కాకుండా స్త్రీ స్వేచ్ఛకు, మహిళా సాధికారతకు, అంతకుమించి మానవతా హృదయానికి అద్దం పడతాయి. ఇప్పటికే ఆమె ఎన్నో కవితలు రాయగా, వాటిని ఓ పుస్తకం కూడా తీసుకొచ్చింది. తన ఇంగ్లీష్ కవితలను తెలుగు లిరిసిస్ట్‌తో ట్రాన్స్‌లేట్ చేయించి, తెలుగు కవితాభిమానులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పంచుకున్న ఓ కవిత వైరల్ కాగా, తాజాగా మరోసారి తన కవి హృదయాన్ని వ్యక్తపరిచింది రేణు.

‘వెన్నెల మేఘాల నీడల్లో.. అర్ధరాత్రి గుసగుసల కలయికలో మన ప్రేమ ఊపిరి పీల్చుకుంటోంది. నీ నిశ్శబ్దం నాకో ఓదార్పు, నీ ఉనికి సున్నితమైన లాలింపు, కొత్త భావాల చిక్కనైన చిట్టడవిలో మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామని ఆశ్చర్యపోతున్నారా? దాక్కున్న వేయి చంద్రుల మీదుగా దారి అల్లుకుంటూ.. ఇంద్రధనస్సు చివరంచులోని మా ప్రేమ భాండాగారాన్ని కనుగొంటాం. తీవ్రమైన కోరికతో ప్రకాశిస్తున్న మార్గం మమ్మల్ని హెచ్చరిస్తున్నా.. మిరుమిట్లు గొలుపుతున్న తుమ్మెదలు మేము ఒకరికొకరమని తెలుపుతున్నాయి’ అని రేణు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది