స్కూల్‌ మధ్యలో ఉన్న బెల్టు షాపులను తీసేయండి

224

దిశ, నల్లబెల్లి: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ప్రక్కన ఉన్న గుడుంబా స్థావరాలు, బెల్టు షాపులను తొలగించాలని ఎబీఎస్ఎఫ్, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో.. నర్సంపేట ఎక్సైజ్ కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గత వారం రోజుల నుంచి స్కూల్ ప్రక్కన ఉన్న బెల్టు షాపులను తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. పాఠశాల హెడ్ మాస్టర్, విద్యార్థి సంఘాలు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్, తహసీల్దార్, ఎక్సైజ్ సీఐ రాజసమ్మయ్యకు వినతి పత్రం ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కనీసం ఇప్పటికైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..