ఆ ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి భారీ షాక్..

56

న్యూఢిల్లీ : పెట్రోల్ బంకుల్లోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రాలతో ఉన్న హోర్డింగ్‌లను మూడు రోజుల్లో(72 గంటలు)గా తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్న ఆ హోర్డింగ్‌లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నదని పేర్కొంది.

ఐదు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే గతనెల 27 నుంచి కేరళ, తమిళనాడు, బెంగాల్, అసోం, పుదుచ్చేరిలలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కోవిడ్ 19 వ్యాక్సినేషన్‌పై ప్రధాని ఫొటోలు, వీడియోలు కోడ్ ఉల్లంఘిస్తున్నదని టీఎంసీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన తర్వాత ఈ ఆదేశాలు వెలువడ్డాయి. వ్యాక్సినేషన్‌కు సంబంధించీ ప్రధాని ఫొటోలు, వీడియోలను 72 గంటల్లో తొలగించాలని ఆదేశించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..