కీసర ఎమ్మార్వో ఆత్మహత్య కేసులో కొత్త కోణం..

8

దిశ, వెబ్‌డెస్క్: చర్లపల్లి జైలులో కీసర తహసీల్దారు నాగరాజు ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. చనిపోవడానికి ముందు అర్థరాత్రి వరకు నాగరాజు నిద్రపొలేదని పోలీసులు గుర్తించారు.

అతన్ని మంజీరా బ్యారక్ రూం నెంబర్‌-11లో ఉంచగా, అతనితో పాటు మరో నలుగురు ఖైదీలు ఉన్నారు. ఆత్మహత్యకు ముందు మిగతా ఖైదీలు పడుకున్నారా లేదా ఏమైనా గొడవ జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.