రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం.. గడువు పొడిగింపు!

by  |
రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం.. గడువు పొడిగింపు!
X

దిశ, వెబ్‌డెస్క్: కిశోర్ బియానీ యాజమాన్యంలోని ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు ఒప్పంద ప్రక్రియను పూర్తిచేసే గడువును రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ 6 నెలలు పొడిగించింది. గతేడాది రూ. 24,713 కోట్లకు ఫ్యూచర్ గ్రూపును కొనేందుకు ఒప్పందం చేసుకున్న రిలయన్స్ సంస్థ ఈ ఏడాది మార్చి 31 నాటికి దాన్ని పూర్తి చేయాలని నిర్దేశించింది. అయితే, ఫ్యూచర్ గ్రూప్ అనుబంధ సంస్థల్లో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు వాటాలున్నాయి.

ఈ క్రమంలో ఫ్యూచర్ రిటైల్‌ను కొనేందుకు అమెజాన్‌కు హక్కులున్నాయి. ఈ అంశంపై వివాదం గతేడాది నుంచి కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండటంతో రిలయన్స్ రిటైల్ ఒప్పంద ప్రక్రియను సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఫ్యూచర్‌ గ్రూపు‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ వ్యాపారాల కొనుగోలుకు రిలయన్స్‌ ఈ ఒప్పందం చేసుకుంది. 2020, ఆగష్టులో ఫ్యూచర్-రిలయన్స్ మధ్య ఒప్పందం జరిగింది. సెబీ సహా ఇతర రెగ్యులేటర్ల నుంచి క్లియరెన్స్ వచ్చింది. అయితే, వాటాదారులు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.


Next Story

Most Viewed