- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిలయన్స్ నిప్పన్ లైఫ్ త్రైమాసిక లాభం రూ. 35 కోట్లు!
<p>దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలను 40 శాతం పెరిగి రూ. 35 కోట్లని ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరానికి ఇదే త్రైమాసికంలో నిప్పన్ లైఫ్ రూ. 25 కోట్లను ఆర్జించింది. ఇక, సంస్థ మొత్తం ఆదాయం రూ. 893 కోట్లు పెరిగాయని, రెన్యువల్ ప్రీమియం 4.4 శాతం వృద్ధితో రూ. 3,435 కోట్లకు పెరిగినట్టు సంస్థ వెల్లడించింది. రెన్యువల్ ప్రీమియం 2018-19 ఆర్థిక సంవత్సరంలో […]</p>

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలను 40 శాతం పెరిగి రూ. 35 కోట్లని ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరానికి ఇదే త్రైమాసికంలో నిప్పన్ లైఫ్ రూ. 25 కోట్లను ఆర్జించింది. ఇక, సంస్థ మొత్తం ఆదాయం రూ. 893 కోట్లు పెరిగాయని, రెన్యువల్ ప్రీమియం 4.4 శాతం వృద్ధితో రూ. 3,435 కోట్లకు పెరిగినట్టు సంస్థ వెల్లడించింది. రెన్యువల్ ప్రీమియం 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,291 కోట్లుగా ఉండేది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ప్రీమియం వసూళ్లు 4 శాతం పెరిగి రూ. 4,375 కోట్లకు చేరినట్టు, నిర్వహణ ఆస్తుల విలువ రూ. 20,281 కోట్లను నుంచి రూ. 19,837 కోట్లకు తగ్గిందని, కరోనా వ్యాప్తి కారణంగా తక్షణ అవసరాల కోసం రూ. 33 కోత్లను కేటాయించామని రిలయన్స్ నిప్పన్ లైఫ్ సంస్థ పేర్కొంది. క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి 97.7 శాతం నుంచి 98.1 శాతానికి పెరిగింది.
Tags: Reliance Nippon Life, Q4 Results, reliance






