'ఉత్తమ యాజమాన్యం' జాబితాలో భారత కంపెనీలు ఇవే

by  |
anil-ambani1
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ రిలయన్స్ ఇండస్ట్రీ అరుదైన ఘనతను సాధించింది. ప్రస్తుత ఏడాదికి ఫోర్బ్స్ ప్రచురించిన బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్-2021 జాబితాలో 52వ స్థానం సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 750 కంపెనీల నుంచి ఈ జాబితా కోసం ఫోర్బ్స్ పరిశీలించింది. ఫోర్బ్స్ ప్రకటించిన టాప్-100 జాబితాలో భారత్ నుంచి నాలుగు సంస్థలకు అవకాశం లభించింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ 52వ స్థానం, ఐసీఐసీఐ బ్యాంక్ 65, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 77, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 90వ ర్యాంకుతో చోటు సంపాదించుకున్నాయి. దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకు ఈ జాబితాలో 117వ స్థానం, మౌలిక రంగ ఎల్అండ్‌టీ 127వ స్థానంలో నిలిచాయి. బీమా దిగ్గజం ఎల్ఐసీ 504, టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ 588, టాటా గ్రూప్ 746వ స్థానంలో ఉన్నాయి. అంతర్జాతీయంగా శాంసంగ్ సంస్థ అగ్రస్థానంలో ఉండగా, ఐపీఎం కంప్యూటర్స్ రెండో స్థానంలో నిలిచింది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, గూగుల్, డెల్, హువావే సంస్థలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 58 దేశాల్లోని 750 కంపెనీల నుంచి 1.50 లక్షల మంది పూర్తిస్థాయి, పార్ట్‌టైమ్ ఉద్యోగుల నుంచి వివరాలను ఫోర్బ్స్ సేకరించింది. ఇందులో కంపెనీల ఆర్థిక ప్రణాళిక, సామాజిక బాధ్యత, నైపుణ్యాభివృద్ధి, జెండర్ ఈక్వాలిటీ లాంటి పలు అంశాల ఆధారంగా జాబితా రూపొందించారు. ఇక, ఈ జాబితాలో భారత్ నుంచి బజాజ్ సంస్థ 215, యాక్సిస్ బ్యాంక్ 215, ఇండియన్ బ్యాంక్ 314, ఓఎన్‌జీసీ 404, అమరరాజా గ్రూప్ 405, కోటక్ బ్యాంక్ 415, బ్యాంక్ ఆఫ్ ఇండియా 451, ఐటీసీ 453, సిప్లా 460, బ్యాంక్ ఆఫ్ బరోడా 496, ఎల్ఐసీ 504వ స్థానాల్లో ఉన్నాయి.


Next Story

Most Viewed