ఆ ఫ్లైఓవర్… బెజవాడ వాసుల కల

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని దుర్గమ్మగుడి ఫ్లైఓవర్‌పై ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ఫ్లైఓవర్‌ను ఈనెల 18న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ ఫ్లైఓవర్‌పై ప్రారంభంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకముందే, ఆయన ప్రారంభ తేదీని ప్రకటించడంతో ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ‘దుర్గగుడి ఫ్లై ఓవర్ ఎన్నో ఏళ్ల బెజవాడ వాసుల కల. అంతా అనుకున్నట్టే ఫ్లై ఓవర్ పూర్తయింది. [&hellip;]</p>

ఆ ఫ్లైఓవర్… బెజవాడ వాసుల కల
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని దుర్గమ్మగుడి ఫ్లైఓవర్‌పై ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ఫ్లైఓవర్‌ను ఈనెల 18న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ ఫ్లైఓవర్‌పై ప్రారంభంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకముందే, ఆయన ప్రారంభ తేదీని ప్రకటించడంతో ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

‘దుర్గగుడి ఫ్లై ఓవర్ ఎన్నో ఏళ్ల బెజవాడ వాసుల కల. అంతా అనుకున్నట్టే ఫ్లై ఓవర్ పూర్తయింది. సెప్టెంబర్ 4న ప్రారంభోత్సవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. అంతలోనే ఊరించినట్లే.. ఊరించి అనూహ్యంగా వాయిదా పడింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మృతితో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. కాగా దీనిపై స్పష్టతనిస్తూ, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు.

Next Story