తగ్గిన యాదాద్రి ఆదాయం.. నెల రోజుల్లో రూ.2.50

by  |
తగ్గిన యాదాద్రి ఆదాయం.. నెల రోజుల్లో రూ.2.50
X

దిశ, నల్లగొండ: కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ ప్రభావం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంపై పడింది. లాక్‌డౌన్ ఆంక్షలతో యాదాద్రి ఆలయాన్ని మూసివేయటంతో హుండీ కానుకలు, ఆర్జిత సేవల రూపంలో వచ్చే ఆదాయంలో భారీగా కోత పడింది. ఆన్​లైన్ పూజలు ద్వారా నెల రోజుల్లో కేవలం రూ.2.50లక్షల రాబడి మాత్రమే వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. కరోనా కట్టడిలో ప్రభుత్వాలు ప్రకటించిన లాక్​డౌన్​తో ఆలయ ఆదాయాలకు గండి పడింది. దైవదర్శనాలు మొక్కు పూజలు అటకెక్కాయి. భక్తులు తమ మొక్కులు తీర్చుకునే అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆన్​లైన్​ పూజల విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని యాదాద్రిలో ఏప్రిల్ 21వ తేదీ నుంచి అమలు చేశారు. వీటికి పెద్దగా ఆదరణ లేదని ఆలయ వర్గాలు వెల్లడించాయి. నెల రోజుల వ్యవధిలో 347 మంది భక్తుల ద్వారా కేవలం 2.50 లక్షల ఆదాయం వచ్చినట్టు తెలిపారు.

Next Story

Most Viewed