- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెట్రోల్ రేట్లు తగ్గించాలని సీపీఐ నిరసన
<p>దిశ, మహబూబ్‌నగర్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ వనపర్తి లో సీపీఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం కేంద్ర దిష్టి బొమ్మకు ఉరి వేసి నిరసన తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఇప్పటివరకు అనేకసార్లు ధరలు పెరిగాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం పేరుతో లీటరుకు 3రూపాయలు పెంచిందని మండిపడ్డారు. దీని వల్ల సగటు వినియోగదారులపై 39 వేల కోట్ల భారం పడనుందని ఆవేదన వ్యక్తం చేశారు. […]</p>

దిశ, మహబూబ్‌నగర్
పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ వనపర్తి లో సీపీఐ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం కేంద్ర దిష్టి బొమ్మకు ఉరి వేసి నిరసన తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఇప్పటివరకు అనేకసార్లు ధరలు పెరిగాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం పేరుతో లీటరుకు 3రూపాయలు పెంచిందని మండిపడ్డారు. దీని వల్ల సగటు వినియోగదారులపై 39 వేల కోట్ల భారం పడనుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో పెట్రోల్ పై 13.50 పైసలు డీజిల్ పై 15.30 పైసలు పెంచారని విమర్శించారు. వెంటనే పెంచిన డీజీల్, పెట్రోల్ ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమైక్య వనపర్తి జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు పి కళావతమ్మ వనపర్తి మండల కార్యదర్శి జె రమేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరేష్ నాయకులు పాల్గొన్నారు.
tags;reduce the petrol,diesel excise tax,13.50 paise on petrol in six years






