ఈసారి అంతకుమించి.. బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-06 05:31:07  IST  )

బాలాపూర్ లడ్డూ వేలం(Balapur Laddu Auction) ప్రక్రియ ప్రారంభం అయింది.

ఈసారి అంతకుమించి.. బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర
X

దిశ, వెబ్‌డెస్క్: బాలాపూర్ లడ్డూ వేలం(Balapur Laddu Auction) ప్రక్రియ ముగిసింది. రూ. రూ.1,116తో వేలం ప్రారంభించారు. మొత్తం 38 మంది భక్తులు లడ్డూ దక్కించుకోవాలని చూడగా, రూ.35 లక్షల వద్ద వేలం ముగిసింది. లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి లడ్డూ దక్కించుకున్నారు. గతేడాది కంటే ఈసారి రూ.4.99 లక్షలు అధికంగా పలకడం విశేషం. కాగా గత సంవత్సరం రూ.30 లక్షలకు పైగా ధర పలకింది. వేలం ముగియడంతో మళ్లీ ఊరేగింపు ప్రారంభించారు. బాలాపూర్ గణేష్‌ను ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేస్తారు. కట్టమైసమ్మ - కేశవగిరి - చాంద్రాయణగుట్ట క్రాస్‌ రోడ్‌- చార్మినార్‌- అఫ్జల్‌గంజ్‌- ఎంజే మార్కెట్‌- అబిడ్స్‌ జీపీవో- లిబర్టీ- అంబేడ్కర్‌ విగ్రహం మీదుగా ట్యాంక్‌బండ్‌‌కు చేరుకోనుంది. ఈ నిమజ్జనోత్సవాన్ని సజావుగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం శనివారం సెలవు ప్రకటించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇస్తున్నట్లు తెలిపింది.

Next Story