దిశ ఎఫెక్ట్.. ఆ ‘నలుగురు’ కలిశారు

by  |
BJP cantonment leaders
X

దిశ, కంటోన్మెంట్: కంటోన్మెంట్ బోర్డు బీజేపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు అంటి ముట్టనట్లు వ్యవహారించిన నలుగురు మాజీ బోర్డు ఉపాధ్యక్షులు ‘దిశ’ కథనంతో ఒకటయ్యారు. కంటోన్మెంట్‘ బీజేపీలో పీక్ స్టేజ్‌కు విభేదాలు.. ఆ ‘నలుగురు’ నేతలది తలోదారి.. అనే కథనం శనివారం దిశ వెబ్ సైట్‌లో వచ్చిన విషయం తెలిసిందే. ఈ కథనంతో బీజేపీ నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్ మహాంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్ హుటాహుటిన రంగంలోకి దిగారు. ఆదివారం కార్ఖానా ఓల్డ్ వాసవీనగర్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో నలుగురు మాజీ ఉపాధ్యక్షులు జంపనప్రతాప్, సాదా కేశవరెడ్డి, భానుక నర్మద మల్లీకార్జున్, జె.రామక్రిష్ణల మధ్య శ్యాంసుందర్ గౌడ్ సయోద్యను కుదిర్చారు.

మాజీ ఉపాధ్యక్షులంతా కలిసి కట్టుగా, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏమైనా చిన్న చిన్న విబేధాలున్నా.. అంతర్గత సమావేశాల్లో చర్చించి పరిష్కారించుకోవాలని, బహిర్గతంగా విమర్శలు చేసుకోవద్దని, ఇది పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి కారణమవుతుందని సూచించారు. దీంతో మాజీ ఉపాధ్యక్షులు నలుగురు కలిసి మెలసి, మా మధ్యన ఉన్న విబేధాలు పక్కన బెట్టి ఇక మీదట పార్టీ పటిష్టత కోసం పని చేస్తామని తెలియజేశారు. అంతేగాకుండా.. వీరు నలుగురు కలిసి ఫోటోలకు పోజులిచ్చారు.



Next Story