హాలీవుడ్ హీరోయిన్‌కు చెవిటి అమ్మాయి లెస్సన్స్

by  |
హాలీవుడ్ హీరోయిన్‌కు చెవిటి అమ్మాయి లెస్సన్స్
X

దిశ, సినిమా: హాలీవుడ్ హీరోయిన్ రెబెకా హాల్ డిఫరెంట్ క్యారెక్టర్స్, జోనర్స్‌తో ఆడియన్స్‌ను మెప్పించింది. ప్రస్తుతం ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్‌’తో మాన్‌స్టర్ జోనర్‌ను ట్రై చేస్తున్న రెబెకా.. ఈ మూవీ షూటింగ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంది. ఓ చెవిటి అమ్మాయి దగ్గర అమెరికన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం గ్రేట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా అభివర్ణించింది. సినిమాల్లో తాను ఒక ఫన్ థింగ్ అండర్‌స్టాండ్ చేసుకున్నానని వివరించింది.

‘కింగ్ కాంగ్’ సినిమాల్లో అందమైన అమ్మాయి ఉంటుంది, తను వాటిని సేవ్ చేయాలని అనుకుంటుందని చెప్పింది. అయితే ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్‌’లో తాను కనుగొన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే.. కాంగ్‌తో ఒక చిన్నారి కనెక్షన్. చిన్న చెవిటి అమ్మాయి కాంగ్‌తో కనెక్ట్ కావడం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందని..అందులోనూ నిజంగానే డెఫ్ గర్ల్ అయిన కైలీ హాటిల్ ఈ పాత్ర చేస్తుందని తెలుసుకున్నప్పుడు మరింత ఎగ్జైట్ అయ్యానని వివరించింది. మూవీలో డాక్టర్ ఆండ్రూస్ పాత్రలో కనిపించిన తాను.. కైలీ పక్కన నటించడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది రెబెకా. తన నుంచి అమెరికన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపింది. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ సినిమా మార్చి 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

Next Story