BIGG BOSS నుంచి రవి ఔట్.. ఆ పనులే కొంప ముంచాయా ?

by  |
BIGG BOSS నుంచి రవి ఔట్.. ఆ పనులే  కొంప ముంచాయా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బాస్ షో అంటే చాలా మందికి ఇష్టం. ప్రతీ ఒక్కరికి బిగ్ బాస్‌లో ఎవరో ఒకరు ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటారు. బిగ్ బాస్‌లో చాలా మందికి ఫేవరేట్ కంటెస్టెంట్ గా ఉండి, స్ట్రాంగ్ కంటెస్టెంట్ లిస్టులో ఉండేది రవి. సంథింగ్ స్పెషల్ ప్రోగ్రాం నుంచి రవికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో రవి తప్పనిసరిగా టాప్ 5 వరకు వెళ్తాడని అందరూ ఊహించారు. కానీ అభిమానులకు షాకిస్తూ రవి ఎలిమినేట్ అయ్యాడు. ఈ ఎలిమినేషన్ ఇంట్లో వారికే కాకుండా ప్రేక్షకులకు, రవి అభిమానులు ఎవరూ ఊహించలేదు. ఇక ఈ ఎలిమినేషన్ ఫేక్ ఎలిమినేషన్ అని రవి అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నారు.

ప్రియాంక, కాజల్ ఇద్దరిట్లో ఎవరో ఒక్కరు బయటకు వెళ్తారనుకుంటే.. ఎవరు ఊహించని విధంగా చివరికి రవి ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లాడు. ఈ సారి అందరికంటే రవికే తక్కువగా ఓట్లు పడ్డాయంటా.. ఎందుకంటే రవి ఇన్ ఫ్లూయెన్స్ చేస్తాడని, ఇంట్లో వారిని చీటింగ్ చేస్తున్నాడని కొన్ని విమర్శలు వచ్చాయి. అంతే కాకుండా రెండు సార్లు అమ్మ మీద ప్రామిస్ చేసి అబద్ధం చెప్పడం, లహారి, శ్వేత వాళ్ల విషయాల్లో కూడా రవి మీద కొంత వరకు నెగిటివ్ ఓపీనియన్ వచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా కావాలని ఇంట్లో వారిని టార్గెట్ చేయడం కూడా రవికి నెగిటివ్ అయినట్టు కొందరి అభిప్రాయం. ఇంత నెగిటివ్ వచ్చినా, రవి దాని నుంచి బయటపడటానికి ప్రయత్నాలు చేయకపోవడం, హౌస్‌లో కూడా మరీ అంత కనెక్ట్ కాకపోవడం ఇలా పలు కారణాల వల్లనే రవి బయటకు వచ్చారని గుసగుసలు వినపడుతున్నాయి. ఏదేమైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ బ‌య‌ట‌కు వెళ్లడం అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది.


Next Story

Most Viewed