దేశంలో కరోనా కేసులు ఎన్నంటే !

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-19 11:12:18  IST  )

<p>దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. ప్రంపంచంలో రోజువారి అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానానికి వెళ్లింది. మొదటి స్థానంలో ఉన్న అమెరికాలో రోజుకు 70 వేల కొత్త కేసుల నమోదవుతుండగా ఆదివారం ఒక్క రోజులో నమోదైన దాదాపు 39వేల కొత్త కేసులతో భారత్ రెండో స్థానంలోకి చేరింది. ప్రపంచంలో వివిధ దేశాల్లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో మాత్రం 37లక్షల కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా బ్రెజిల్ [&hellip;]</p>

దేశంలో కరోనా కేసులు ఎన్నంటే !
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. ప్రంపంచంలో రోజువారి అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానానికి వెళ్లింది. మొదటి స్థానంలో ఉన్న అమెరికాలో రోజుకు 70 వేల కొత్త కేసుల నమోదవుతుండగా ఆదివారం ఒక్క రోజులో నమోదైన దాదాపు 39వేల కొత్త కేసులతో భారత్ రెండో స్థానంలోకి చేరింది. ప్రపంచంలో వివిధ దేశాల్లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో మాత్రం 37లక్షల కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా బ్రెజిల్ రెండో స్థానంలో భారత్ మూడవ స్థానంలో ఉన్నాయి. కరోనా మరణాల్లో దేశం ఎనిమిదవ స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించే‌సరికి గడిచిన 24గంటల్లో దేశంలో అత్యధికంగా 38,902 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ప్రవేశించినప్పటి నుంచి రోజులో నమోదైన గరిష్ట కేసుల సంఖ్య ఇదే కావడం ఇటీవల పెరిగిన వ్యాధి వ్యాప్తి వేగాన్ని తెలియజేస్తోంది. కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 10,77,618కి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ బారిన పడి దేశంలో ఒక్కరోజే 543 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 26,816కు చేరింది. ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారిలో 6,77,423 మంది కోలుకోగా ప్రస్తుతం 3,73,379 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో కరోనా వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. ఢిల్లీలో ఒక్కరోజే 1,211 కొత్త కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 1,22,793కు చేరింది. ఇక్కడ కొత్తగా 31మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు 3,628 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. మహారాష్ట్రలో ఒక్క రోజులోనే అత్యధికంగా 9,518 పాజిటివ్ కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 3,10,455కి వెళ్లింది. 24 గంటల్లో వైరస్ బారినపడి 258 మంది చనిపోగా మొత్తం మరణాలు 11,854కి చేరాయి. తమిళనాడులో 24 గంటల్లో 4,979 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 1,70,693కు చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 78 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 2,481కి చేరింది. గుజరాత్‌లో ఇప్పటివరకు ఉన్న 48,441 కేసులకు గాను 2147మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 5041 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 49,650కి చేరింది. ఒక్కరోజే ఏపీలో కరోనాతో 56 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ సోకి 642 మంది మృత్యువాత పడ్డారు.

Next Story