RCB జట్టును కలసిన డివిలియర్స్..

by Kema Shiva Kumar |

<p>దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరో నాలుగు వారాల్లో యూఏఈ (UAE)లో ప్రారంభం కానుంది. ఇప్పటికే పలు జట్లు ప్రత్యేక విమానాల్లో దుబాయ్, అబుదాబి చేరుకున్నాయి. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ ( Kings elevan), రాజస్తాన్‌ రాయల్స్‌ (Rajasthan royals), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkotha Knight riders) గురువారం దుబాయ్ చేరుకోగా.. ముంబై ఇండియన్స్(Mumbai indians), చెన్నై సూపర్‌ కింగ్స్ ( Csk), రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (Rcb) జట్లు శుక్రవారం యూఏఈలో ల్యాండ్ [&hellip;]</p>

RCB జట్టును కలసిన డివిలియర్స్..
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరో నాలుగు వారాల్లో యూఏఈ (UAE)లో ప్రారంభం కానుంది. ఇప్పటికే పలు జట్లు ప్రత్యేక విమానాల్లో దుబాయ్, అబుదాబి చేరుకున్నాయి. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ ( Kings elevan), రాజస్తాన్‌ రాయల్స్‌ (Rajasthan royals), కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkotha Knight riders) గురువారం దుబాయ్ చేరుకోగా.. ముంబై ఇండియన్స్(Mumbai indians), చెన్నై సూపర్‌ కింగ్స్ ( Csk), రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (Rcb) జట్లు శుక్రవారం యూఏఈలో ల్యాండ్ అయ్యాయి.

భారతీయ క్రికెటర్లు అందరూ ఇండియా నుంచి ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన విమానాల్లో అక్కడకు చేరుకోగా, విదేశీ క్రికెటర్లు ఒక్కొక్కరూ తమ జట్లతో కలవడానికి విడివిడిగా అక్కడకు బయలుదేరారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Rcb) జట్టు సభ్యుడు ఏబీ డివిలియర్స్ (Abd) దుబాయ్ చేరుకున్నాడు. ప్రత్యేక విమానంలో దక్షిణాఫ్రికా నుంచి డివిలియర్స్‌తో పాటు డేల్ స్టెయిన్, క్రిస్ మోరీస్ యూఏఈ చేరుకొని జట్టుతో కలిశారు. చాలా రోజుల తర్వాత క్రికెటర్లను కలుసుకోవడంతో ఆర్సీబీ జట్టులో సందడి నెలకొంది. డివిలియర్స్‌ను కెప్టెన్ విరాట్ కొహ్లీ సాదరంగా ఆహ్వానించాడు.

Next Story