- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు మూడోసారి బ్రేక్
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన మూడోసారి వాయిదా పడింది. గురువారం కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ ఇంజినీర్లు రాయలసీమ పరిశీలనకు వెళ్లాల్సి ఉండగా బుధవారం రాత్రి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయపురే లేఖ విడుదల చేశారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు వెళ్లాల్సి ఉందని, దీని కోసం ఈ నెల 5న టూర్ఖరారు చేసినట్లు వివరించారు. కానీ […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన మూడోసారి వాయిదా పడింది. గురువారం కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ ఇంజినీర్లు రాయలసీమ పరిశీలనకు వెళ్లాల్సి ఉండగా బుధవారం రాత్రి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయపురే లేఖ విడుదల చేశారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు వెళ్లాల్సి ఉందని, దీని కోసం ఈ నెల 5న టూర్ఖరారు చేసినట్లు వివరించారు. కానీ పలు కారణాలతో వాయిదా వేసుకున్నామని, మళ్లీ పర్యటన వివరాలు చెప్పుతామంటూ లేఖలో పేర్కొన్నారు. కాగా రాయలసీమ ఎత్తిపోతల పరిశీలన టూర్మూడోసారి వాయిదా పడింది.
ఇప్పటికే రెండుసార్లు నిపుణుల బృందం అక్కడకు వెళ్లేందుకు ఏపీకి లేఖ రాశారు. కానీ నోడల్ అధికారిని ఏర్పాటు చేసేందుకు ఏపీ ముందుకు రాలేదు. ఇప్పుడు కూడా ఏపీ నుంచి రిప్లై లేకపోవడంతో నిపుణుల బృందం పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 9న ఎన్జీటీలో ఈ విషయంపై నివేదిక ఇవ్వాల్సి ఉంది. మరో నాలుగు రోజులే గడువు ఉండటంతో పరిశీలన టూర్ ఉంటుందా.. అనేది అనుమానంగా మారింది. అయితే కేఆర్ఎంబీ తరుపున మళ్లీ వాయిదా కోరేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.






