- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన రాయలసీమ టీడీపీ లీడర్లు..
<p>దిశ, ఏపీ బ్యూరో: రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీరు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాయలసీమ టీడీపీ నేతలు ఆరోపించారు. సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వ వివక్షను దీటుగా ఎదుర్కొంటామని టీడీపీ నేతలు వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీమకు అన్యాయం జరిగితే ఉద్యమం చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. అనంతపురం జిల్లాలోని కమ్మభవన్‌లో శనివారం రాయలసీమ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు సమావేశమయ్యారు. రాయలసీమ జల ప్రాజెక్టులు, భవిష్యత్ పరిణామాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా వైసీపీ […]</p>

దిశ, ఏపీ బ్యూరో: రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీరు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాయలసీమ టీడీపీ నేతలు ఆరోపించారు. సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వ వివక్షను దీటుగా ఎదుర్కొంటామని టీడీపీ నేతలు వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీమకు అన్యాయం జరిగితే ఉద్యమం చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. అనంతపురం జిల్లాలోని కమ్మభవన్‌లో శనివారం రాయలసీమ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు సమావేశమయ్యారు. రాయలసీమ జల ప్రాజెక్టులు, భవిష్యత్ పరిణామాలపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం రాయలసీమకు నీళ్లివ్వడంలో తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సీఎం జగన్ కుమ్మక్కై సీమకు తీరని అన్యాయం చేస్తున్నారని హెచ్చరించారు. ఈ సదస్సులో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సదస్సుల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని తేల్చిపారేశారు. అంతేకాదు సదస్సు నిర్వాహకులైన కాల్వ శ్రీనివాసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది.
సీమకు అన్యాయం జరుగుతుంటే సీఎం జగన్ మౌనం సరికాదు: పరిటాల సునీత
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత పరిటాల సునీత స్పందించారు. జలవివాదాలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా అధికారులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. అనంతపురం జిల్లా కరవు జిల్లా అని ఈ విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసునన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కేసీఆర్‌కు కూడా తెలుసునని.. ఈ విషయాలను గుర్తెరిగి వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల విషయంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతపురం పరిస్థితులు కేసీఆర్‌కు పూర్తిగా తెలుసునన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ అనంతపురం జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రిగా కూడా వ్యవహరించారని సునీత గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు. రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే సీఎం జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. రాయలసీమ బిడ్డగా చెప్పుకునే సీఎం జగన్ ప్రాజెక్టుల అంశంలో తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
రాయలసీమ ద్రోహిగా జగన్ మిగిలిపోతాడు : పయ్యావుల కేశవ్
హంద్రీనీవా, గాలేరు-నగరి తెలుగు గంగ ప్రాజెక్టులు ఎన్టీఆర్ మానసపుత్రికలు అని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన సీఎంలు ఎప్పుడూ రాయలసీమ జలాలు గురించి పట్టించుకోలేదని విమర్శించారు. రాయలసీమ మిటిగేషన్ ప్రాజెక్ట్ కాదు రాయలసీమ లిటిగేషన్ ప్రాజెక్టు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం తీరు వల్లే కేఆర్‌ఎంబీ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు., సీఎంలు జగన్, కేసీఆర్‌ల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. హంద్రీనీవా కాలువ వెడల్పు పెంచకపోతే సీమ ద్రోహిగా జగన్ మిగిలిపోతారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ హెచ్చరించారు.
సదస్సులు శుద్ధదండగే : మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులపై జేసీ ఆగ్రహం
అనంతపురం కమ్మభవన్‌లో శనివారం జరిగిన రాయలసీమ టీడీపీ నేతల సమావేశంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల విషయంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ఇప్పుడు సదస్సులు నిర్వహించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో జేసీ సీమ ప్రాజెక్టుల కంటే కార్యకర్తలను కాపాడాలని హితవు పలికారు. ప్రాజెక్టులపై పోరాటంతో ఫలితం ఉండదని జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాల్వ శ్రీనివాసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. ఇలాంటి కార్యక్రమాల వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభమేమీ ఉండదన్నారు. రెండేళ్ల నుంచి ఒక్క టీడీపీ కార్యకర్తను కూడా పార్టీ నాయకత్వం పట్టించుకోలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. కేవలం కాల్వ శ్రీనివాసులు కనుసన్నల్లోనే ఈ సదస్సు జరుగుతోంది. ఆయన వెంట అనంతపురం టీడీపీ నాయకులు గానీ కార్యకర్తలు గానీ లేరంటూ విరుచుకుపడ్డారు. సమాచారం ఇవ్వకుండానే సాగునీటి ప్రాజెక్టులపై సదస్సులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కార్యకర్తల కోసం మీటింగ్ లు పెట్టాలి గానీ ఇలాంటి పనికిరాని సదస్సులు శుద్ధ దండగే అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు.






