ప్రశాంత్ వర్కింగ్ స్టైలే ‘కేజీఎఫ్‌‌ 2’ ప్రత్యేకత : రవీన

by  |
ప్రశాంత్ వర్కింగ్ స్టైలే ‘కేజీఎఫ్‌‌ 2’ ప్రత్యేకత : రవీన
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘కేజీఎఫ్ 2’ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. జనవరి 8న యశ్ పుట్టినరోజు సందర్భంగా కేజీఎఫ్-2 సెకండ్ చాప్టర్ టీజర్ రిలీజ్ అవుతుండగా.. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న బాలీవుడ్ యాక్ట్రెస్ రవీనా టాండన్ మీడియాతో ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. సినిమా కథ వినగానే ఎలా ఫీలయ్యారు? యశ్, ప్రశాంత్ నీల్ వర్కింగ్ స్టైల్.. సినిమాలో తన క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు.

యష్‌తో తొలిసారి పనిచేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
అద్భుతమైన అనుభవం. యష్‌ ఓ జెమ్. ఎంత ప్రతిభావంతుడో, అంత మంచివాడు. తనతో పనిచేసిన ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను.

‘ కేజీఎఫ్‌2’లో మీ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతోంది?
చాలా వైవిధ్యమైన, ఆసక్తికరమైన పాత్రలో కనిపిస్తాను. అందుకే క్యారెక్టర్ గురించి ఇప్పుడు ఎక్కువగా చెప్పలేను. నా పాత్ర పేరు రమికా సేన్‌. కాస్త కాంప్లెక్స్‌గా అనిపిస్తుంది. అంతే పవర్‌ఫుల్‌ కూడా. కాస్త గ్రే షేడ్స్ ఉంటాయి. నెక్స్ట్ సీన్‌లో ఎలా బిహేవ్‌ చేస్తుందో కూడా ఊహించలేరు. అంత గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే ఉంటుంది.

యష్‌తో స్క్రీన్ షేర్‌పై ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా ఉన్నారు.. అభిమానుల నుంచి ఎలాంటి మెసేజ్‌లు అందాయి?
అభిమానులు అలా ఎదురుచూస్తున్నారన్న ఆలోచనే ఆనందాన్నిస్తోంది. ఈ సినిమాలో నటిస్తున్నానని చెప్పిన క్షణం నుంచే ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ‘కేజీఎఫ్‌’కు చాలా పెద్ద ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అందుకే సీక్వెల్‌ కోసం చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో నా ఫస్ట్ లుక్‌ చూస్తే అభిమానులకు పండగే. ఆన్‌‌స్క్రీన్‌లో రమికను చూడటానికి ఇష్టపడతారు. కచ్చితంగా అభిమానుల మనసులో నిలిచిపోయే పాత్ర అవుతుంది.

ఈ చిత్రంలో మీరు ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సన్నివేశాలు కూడా చేసినట్టున్నారు?
నవ్వుతూ.. ఇంకొన్నాళ్లు ఓపిక పడితే, స్క్రీన్‌ మీద చూస్తారు కదా..

ఈ సినిమాను మీరు ఒప్పుకున్న క్షణాలు గుర్తున్నాయా?
డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ స్టోరీ చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. తను ఈ కథ చెప్పేటప్పటికి కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ కూడా చూడలేదు. ఆ తర్వాత చూశాక.. ఇంత అద్భుతంగా సినిమా ఎలా తీశాడా? అని ఆశ్చర్యపోయాను. ‘కేజీఎఫ్1’లో న్యూ ఏజ్‌ సినిమా అప్రోచ్‌ కనిపించింది. ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ 2’ కథ చెప్పిన తీరు సినిమాను కళ్ల ముందు నిలిపింది. మూవీ వద్దనో, చేయననో చెప్పడానికి నా దగ్గర ఒక్క కారణం కూడా కనిపించలేదు. పైగా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అందుకే వెంటనే ఓకే చెప్పేశాను.

ప్రశాంత్‌ నీల్‌తోనూ, హోంబలే ఫిల్మ్స్ సంస్థతోనూ మీ అసోసియేషన్‌ గురించి?
ప్రశాంత్‌ పనిచేసే తీరు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. తన వర్కింగ్‌ స్టైలే తనని స్పెషల్‌గా నిలిపింది. చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉండే అతనిలో అలాంటి ఆలోచనల ప్రవాహం సాగుతూ ఉంటుందని ఎవరూ అనుకోరు. కానీ అతని కలలు, ఆలోచనలు.. సామాన్యులకు ఊహాతీతంగా ఉంటాయి.



Next Story