రష్మిక ‘పొగరు’తో ఆందోళనకు దిగిన మతపెద్దలు

81

దిశ, సినిమా : హీరోయిన్ రష్మిక మందన, హీరో ధృవ సర్జా జంటగా తెరకెక్కిన కన్నడ మూవీ ‘పొగరు’ ఫిబ్రవరి 19న రిలీజైంది. మంచి ఓపెనింగ్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర గ్రేట్ రన్‌తో దూసుకెళ్తోంది. కానీ ఇంతలోనే ఎదురైన ఓ వివాదం సినిమాను చిక్కుల్లో పడేసింది. ఈ చిత్రంలోని ఒక కాంట్రవర్షియల్ సీన్ తమ రిలీజియన్ సెంటిమెంట్స్‌ను దెబ్బతీసేలా ఉందని, వెంటనే ఆ సన్నివేశాన్ని తొలగించాలని సంబంధిత మతపెద్దలు డిమాండ్ చేశారు.

ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో పూజారి భుజంపై రౌడీలు కాలు పెట్టే సీన్‌ను వెంటనే డిలీట్ చేయాలన్నారు. సినిమా ద్వారా ఎలాంటి సందేశం ఇస్తున్నారని దర్శక, నిర్మాతలను ప్రశ్నించిన బ్రాహ్మిణ్ కమ్యూనిటీ లీడర్స్.. ఈ చిత్రం యువతను తప్పుదారి పట్టించేలా ఉందన్నారు. ఒకవేళ తమ డిమాండ్లకు తలొగ్గకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..