- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభిమానులకు రష్మిక సలహా..
<p>దిశ, వెబ్‌డెస్క్: అందాల భామ రష్మిక మందన తనను ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు చెప్తూనే ఉంటుంది. తన ప్రతిభను గుర్తించిన ఫ్యాన్స్.. తన పట్ల చూపిస్తోన్న ప్రేమకు దాసోహం అంటూ, వారితో ఎప్పుడూ టచ్‌లో ఉండేందుకు ట్రై చేస్తుంది. తను ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది? ఎలా ముందుకెళ్తే సక్సెస్ అవుతాను? అనే విషయాల్లో అభిమానుల సలహా తీసుకునే ఈ కన్నడ భామ.. అభిమానులకు కూడా మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ సీక్రెట్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: అందాల భామ రష్మిక మందన తనను ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు చెప్తూనే ఉంటుంది. తన ప్రతిభను గుర్తించిన ఫ్యాన్స్.. తన పట్ల చూపిస్తోన్న ప్రేమకు దాసోహం అంటూ, వారితో ఎప్పుడూ టచ్‌లో ఉండేందుకు ట్రై చేస్తుంది. తను ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది? ఎలా ముందుకెళ్తే సక్సెస్ అవుతాను? అనే విషయాల్లో అభిమానుల సలహా తీసుకునే ఈ కన్నడ భామ.. అభిమానులకు కూడా మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ సీక్రెట్ షేర్ చేసింది.
‘మీరు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ముందుగా దాని గురించి ఒక పేపర్‌పై రాసుకోండి’ అని సూచించింది. ఇలా చేయడం ద్వారా మనసు, మెదడు చాలా అద్భుతాలు చేస్తాయని చెప్తోంది. దీనికి తనే ఓ ఉదాహరణ అంటున్న రష్మిక.. మీ మెదడులోని ఆలోచనలను పేపర్ మీద పెట్టినప్పుడే మంచి సమాధానం దొరుకుతుందని, అప్పుడే లైఫ్‌ను చక్కగా లీడ్ చేయగలరని అంటోంది. జీవితంలో ఏదైనా విషయంపై స్పష్టమైన అవగాహన రావాలి అనుకున్నప్పుడు ఈ పద్ధతి ఫాలో కావడం బెస్ట్ ఆప్షన్ అని సజెస్ట్ చేస్తోంది. ఇలా చేయడం ద్వారా మీరు ఎలాంటి వ్యక్తి అనేది తెలుస్తుందని.. అదొక అద్భుతమైన ఫీలింగ్ అని అంటోంది రష్మిక.






