‘సుల్తాన్’ చాలా స్పెషల్ : రష్మిక

368

దిశ, వెబ్‌డెస్క్: తమిళ్ హీరో కార్తీ లేటెస్ట్ మూవీ ‘సుల్తాన్’ ఫస్ట్ లుక్ రిలీజైంది. సింపుల్ లుక్‌లో మాసివ్ అప్పీల్‌తో ఉన్న కార్తీ కమాండింగ్ అమేజింగ్ అంటున్నారు ఫ్యాన్స్. బక్కియరాజ్ కన్నన్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ద్వారా కన్నడ బ్యూటీ రష్మిక మందన కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. ‘ఒఫో.. కార్తీ సార్ ఫస్ట్ లుక్‌లో చాలా భయపెడుతున్నారు’ అంటూ సుల్తాన్ పోస్టర్ షేర్ చేసింది.

కాగా, తనకు ఈ సినిమా చాలా స్పెషల్ అని చెప్పిన రష్మిక.. చిన్నప్పటి నుంచి నాన్నతో కలిసి చాలా తమిళ సినిమాలు చూశానని చెప్పింది. అలాంటిది తానే ఇప్పుడు ఒక తమిళ సినిమా చేయబోతుండటం చాలా గొప్ప అనుభూతిని ఇస్తోందని తెలిపింది. అద్భుతమైన, దయ కలిగిన సుల్తాన్ మూవీ యూనిట్‌తో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సమర్పిస్తున్న సినిమాను ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తుండగా.. త్వరలోనే థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..