ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్న రష్మిక.. మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ స్టార్ట్

by  |
Rashmika Mandana
X

దిశ, సినిమా: ‘మిషన్ మజ్ను’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న క్యూట్ హీరోయిన్ రష్మిక మందన అప్పుడే రెండో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. రష్మికతో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ ప్రధానపాత్రలో కనిపించబోతున్న సినిమా పూజా కార్యక్రమం ముంబైలో ఘనంగా జరిగింది. వికాస్ బాల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని బాలాజీ మోషన్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తుండగా, ‘గుడ్ బై’ టైటిల్ కన్ఫర్మ్ అయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది రష్మిక.

పర్‌ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువగా ఉన్న ఈ అమేజింగ్ ప్రాజెక్ట్‌లో భాగం కావడం థ్రిల్‌గా ఉందని తెలిపింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా సుధాకర్ రెడ్డి వర్క్ చేస్తున్నారు. కాగా రష్మిక ఫస్ట్ కోలీవుడ్ ప్రాజెక్ట్ ‘సుల్తాన్’ ఈ రోజు (శుక్రవారం) రిలీజై పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఇక టాలీవుడ్‌లో ‘పుష్ప’ షూటింగ్‌లో పాల్గొంటున్న రష్మిక మరిన్ని ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.

https://twitter.com/iamRashmika/status/1377862272148676610?s=20

Next Story

Most Viewed