రష్మి… 100 ఎకరాల ఆసామి!

by Shyam |
రష్మి… 100 ఎకరాల ఆసామి!
X

దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలి అంటారు పెద్దలు. ఈ సామెత మన సినిమా వాళ్లకు చాలా నచ్చింది. అందుకే మంచి క్రేజ్ ఉన్నప్పుడే అధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేసి ఎంతోకొంత వెనకేసుకుంటారు. జబర్దస్త్ షోతో ఫేమస్ అయిన రష్మి కూడా ఇదే దారిలో ప్రయాణిస్తుంది. సినిమాల్లో చేసినప్పుడు ఏ మాత్రం పేరు రాని రష్మికి… జబర్దస్త్ హోస్ట్‌గా అడుగుపెట్టగానే సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. ఈమెను చూసేందుకు కూడా జబర్దస్త్ షో చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. దీంతో హోస్ట్‌గా రెమ్యునరేషన్ భారీగా తీసుకుని పొదుపు చేసిన రష్మి… భవిష్యత్ గురించి భూమి కొనిందట. ఏకంగా 100 ఎకరాల భూమి కొని అందులో వ్యవసాయం చేయించేందుకు నిర్ణయం తీసుకుందట. అస్సాం, ఆంధ్రా సరిహద్దుల్లో భూమి కొనుగోలు చేసిన ఆమె.. పండ్ల తోటలు సాగు చేసి లాభాలు గడించాలని చూస్తోందట.

దివంగత కథానాయకుడు సోగ్గాడు శోభన్ బాబు చెప్పినట్లు భూమిని నమ్ముకున్న రష్మి… మంచి పని చేసిందని కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. డబ్బును అడ్డగోలుగా ఖర్చు పెట్టకుండా రూ. 5 కోట్లతో భూమిని కొనేయడం మంచి నిర్ణయమంటున్నారు.

Advertisement

Next Story