- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు అరుదైన గౌరవం
<p>దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకి డయానా అవార్డు వచ్చింది. 9 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ఇచ్చే ఈ అవార్డు ఈ సారి హిమన్షు రావును వరించింది. సమాజంలో మార్పు కోసం మానవీయ దృక్పథంతో చేసే పనులకు ఈ అవార్డు అందజేస్తారు. దివంగత బ్రిటన్ రాజకుమారి డయానా పేరుతో ఈ అవార్డును ఏర్పాటు చేయగా, బ్రిటన్ కేంద్రంగా ఈ అవార్డును ప్రధానం చేసే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా యువకులు […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకి డయానా అవార్డు వచ్చింది. 9 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ఇచ్చే ఈ అవార్డు ఈ సారి హిమన్షు రావును వరించింది. సమాజంలో మార్పు కోసం మానవీయ దృక్పథంతో చేసే పనులకు ఈ అవార్డు అందజేస్తారు. దివంగత బ్రిటన్ రాజకుమారి డయానా పేరుతో ఈ అవార్డును ఏర్పాటు చేయగా, బ్రిటన్ కేంద్రంగా ఈ అవార్డును ప్రధానం చేసే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా యువకులు చేసే సోషల్ వర్క్‌ను ఈ అవార్డు కోసం పరిగణలోకి తీసుకుంటుంది.
హిమాన్షు గ్రామాల్లో స్వయం సమృద్ధి దిశగా చేపట్టాల్సిన పలు అంశాలను పరిగణలోకి తీసుకుని స్వయంగా శోమ పేరుతో ఒక ప్రాజెక్ట్ ప్రారంభించారు. గజ్వేల్ నియోజకవర్గంలో గంగాపూర్, యూసుఫ్ ఖాన్‌పల్లి గ్రామాల్లో పలు కార్యక్రమాలను చేపట్టారు. ఈ ప్రాజెక్టు కోసం తనకు సంపూర్ణ మార్గదర్శనం చేసిన తన తాత, సీఎం కేసీఆర్‌కి హిమాన్షు ధన్యవాదాలు తెలిపారు. అవార్డు వచ్చిన సందర్భంగా హిమన్షుకు, ఆయన మిత్రులు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. 15 ఏళ్ల వయసులోనే మానవీయ దృక్పథంతో గ్రామాల్లో మార్పునకు చేపట్టిన కార్యక్రమాలతో అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పొందడం గొప్ప విషయమని పలువురు అభినందించారు.






