- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొలానికి గేదెలు తోలుకుని వెళ్లిన యువతిపై అత్యాచారం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని తుంగపాడుకు చెందిన ఓ యువతి పొలానికి గేదెలు తొలుకొని వెళ్లింది. ఆమె ఒంటరిగా ఉండటాన్ని చూసిన అదే గ్రామానికి చెందిన శేషగిరావు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూతురు నీరసంగా ఉండటంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి నిలదీశారు. దీంతో తనపై శేషగిరిరావు దారుణానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. బాధితురాలితో […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని తుంగపాడుకు చెందిన ఓ యువతి పొలానికి గేదెలు తొలుకొని వెళ్లింది. ఆమె ఒంటరిగా ఉండటాన్ని చూసిన అదే గ్రామానికి చెందిన శేషగిరావు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూతురు నీరసంగా ఉండటంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి నిలదీశారు. దీంతో తనపై శేషగిరిరావు దారుణానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. బాధితురాలితో కలిసి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శేషగిరిరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితురాలు మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
Next Story






