- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం : ఇంట్లో టీవీ చూడటానికి వచ్చిన వృద్ధుడు.. అంత పని చేశాడా ..
<p>దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. ముక్కుపచ్చలారని పసిపిల్లల నుంచి మంచాన పడిఉన్న వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. సైదాబాద్ చిన్నారి ఘటన మరువక ముందే తాజాగా మెదక్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని నిజాంపేట మండలం నార్లాపూర్‌లో మైనర్ బాలిక (17) పై 65ఏళ్ల వృద్దుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. ముక్కుపచ్చలారని పసిపిల్లల నుంచి మంచాన పడిఉన్న వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. సైదాబాద్ చిన్నారి ఘటన మరువక ముందే తాజాగా మెదక్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని నిజాంపేట మండలం నార్లాపూర్‌లో మైనర్ బాలిక (17) పై 65ఏళ్ల వృద్దుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అస్వస్థకు గురి కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే వృద్ధుడు ఇంట్లో టీవీ చూడటానికి వచ్చిన సమయంలో అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
- Tags
- medak
- minor girl






