- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్‌పై అత్యాచారం.. చంపేస్తానని బెదిరింపు
<p>దిశ, కామారెడ్డి: కామారెడ్డిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని సదాశివనగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… మండల కేంద్రానికి ఓ మైనర్ బాలికపై కళ్లెం సాయిలు అనే కామాంధుడు కన్నేశాడు. బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. అనంతరం బాలికపై అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అంతేకాకుండా.. గత నాలుగు రోజుల క్రితం పొలం వద్దకు మైనర్ బాలికను […]</p>

X
దిశ, కామారెడ్డి: కామారెడ్డిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని సదాశివనగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… మండల కేంద్రానికి ఓ మైనర్ బాలికపై కళ్లెం సాయిలు అనే కామాంధుడు కన్నేశాడు. బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. అనంతరం బాలికపై అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అంతేకాకుండా.. గత నాలుగు రోజుల క్రితం పొలం వద్దకు మైనర్ బాలికను సాయిలు తీసుకెళ్లి మళ్ళీ అత్యాచారం చేశాడు. భయాందోళన చెందిన బాలిక విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో తల్లి సదాశివనగర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






