అశ్లీల చిత్రాలు తీసి.. అఘాయిత్యం

by  |
అశ్లీల చిత్రాలు తీసి.. అఘాయిత్యం
X

దిశ, వెబ్‌డెస్క్: వివాహేతర సంబంధాలు ఎన్నో అఘాయిత్యాలకు దారి తీస్తున్నాయి. చిన్న చిన్న కారణాలతో భార్యా-భర్తల మధ్య గొడవలు రావడంతో కొంతమంది ప్రబుద్ధులు వారి గొడవలను ఆసరాగా చేసుకుంటున్నారు. భర్త తాగివస్తున్నాడనో, కొడుతున్నాడనో, ఇతర మహిళలతో స్నేహం చేస్తున్నాడన్న కారణాలు చెప్పుకుంటూ భార్యలకు దగ్గరవుతున్నారు కొంతమంది కామాంధులు. తొలుత మంచివాడిగా నటిస్తూ..చివరకు విషం చిమ్ముతున్నారు. ఇటువంటి ఘటన మంచిర్యాల జిల్లాలో కలకలంరేపింది.

వివరాళ్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా మేమనపల్లి మండలం సూరారంలో దారుణం వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన ఓ ఆటో డ్రైవర్‌కు కొద్ది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే, తరచూ ఇంటికి తాగి వచ్చేవాడు. దీంతో అతడి భార్య విసుగు తెచ్చుకునేది. నిత్యం తాగి రావడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. అయితే, వీరి కుటుంబ పరిస్థితులను గమనిస్తున్న అదే గ్రామానికి చెందిన ఓ లారీ డ్రైవర్ ఆ మహిళపై కన్నేశాడు. ఇలానే, ఏదో ఒక కారణంతో ఆమెతో పరిచయం పెంచుకోసాగాడు. ఇలానే తరచూ ఇంటికి వచ్చి కాలాక్షేపం చేసేవాడు. ఈ క్రమంలోనే ఆ మహిళకు మరింత దగ్గరయ్యాడు.

అయితే, ఓ రోజు ఆ మహిళ బాత్‌రూములో స్నానం చేస్తుండగా గమనించిన లారీ డ్రైవర్.. చాటుగా నగ్న వీడియోలను చిత్రీకరించాడు. అనంతరం వీడియోలను అడ్డుగా పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేశాడు. తన కోరిక తీర్చకుంటే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించి.. ఆమెపై రోజూ అత్యాచారం చేశాడు. దీంతో విసుగు చెందిన ఆ మహిళ అతడి కోరిక తీర్చడానికి ఓసారి నిరాకరించింది. దీంతో వెంటనే ఆ వీడియోను అతడు వాట్సాప్‌లో షేర్ చేశాడు. ఇది కాస్తా తనకు, భర్త,కు తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. తనను బ్లాక్ మెయిల్ చేస్తూ.. బలవంతంగా అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story

Most Viewed