- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒంగోలు రిమ్స్‌లో కీచకపర్వం.. రోగుల కళ్లెదుటే బెడ్ మీద నర్సుపై..!
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో మరో కీచకపర్వం శుక్రవారం వెలుగుచూసింది. కామంతో కళ్లుమూసుకపోయిన ఓ రోగి బంధువు అందరూ చూస్తుండగానే నర్సుపై లైంగికదాడికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది, రోగుల బంధువులు నర్సును కీచకుడి చెర నుంచి రక్షించారు. ముందుగా రోగి ఆరోగ్యం పరీక్షించేందుకు వచ్చిన నర్సును ఆ వ్యక్తి వెనుక నుంచి అసభ్యంగా తాకాడు. అది గుర్తించిన ఆమె వెంటనే ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహించిన కామాంధుడు ఆమెను లాగి బెడ్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో మరో కీచకపర్వం శుక్రవారం వెలుగుచూసింది. కామంతో కళ్లుమూసుకపోయిన ఓ రోగి బంధువు అందరూ చూస్తుండగానే నర్సుపై లైంగికదాడికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది, రోగుల బంధువులు నర్సును కీచకుడి చెర నుంచి రక్షించారు.
ముందుగా రోగి ఆరోగ్యం పరీక్షించేందుకు వచ్చిన నర్సును ఆ వ్యక్తి వెనుక నుంచి అసభ్యంగా తాకాడు. అది గుర్తించిన ఆమె వెంటనే ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహించిన కామాంధుడు ఆమెను లాగి బెడ్ మీద పడేసి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఈ వ్యవహారం అంతటిని చికిత్స పొందుతున్న రోగులు కళ్లారా చూశారు. అనంతరం రిమ్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బాధిత నర్సు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






