ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు సూపర్‌స్టార్స్

by  |
ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు సూపర్‌స్టార్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సూపర్ కూల్ హీరో, ఫ్యాషన్ ఐకాన్ అయిన రణ్‌వీర్‌సింగ్.. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో కలిసి ఓ యాడ్ చేశాడు. కాగా ఆ షూట్‌ విశేషాలతో పాటు మహేశ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి రణ్‌వీర్ ఇన్‌స్టా వేదికగా స్వీట్ నోట్ షేర్ చేశాడు. ‘మహేశ్ ఫైనెస్ట్ జెంటిల్‌మ్యాన్’ అని ప్రశంసించారు.

మహేశ్, రణ్‌వీర్‌ కలిసి చేసిన ‘థమ్స్‌అప్’ యాడ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఓ ఫ్యాక్టరీలో ఇద్దరు(మహేశ్, రణ్‌వీర్) థమ్స్‌అప్ కోసం రన్నింగ్ చేస్తుండటాన్ని యాడ్‌లో గమనించొచ్చు. ‘వన్ ఫైనల్ చేజ్.. స్టే ట్యూన్‌డ్’ అన్న కోట్‌తో యాడ్ ముగుస్తుంది. అయితే షూటింగ్ సమయంలో మహేశ్‌తో జరిగిన సంభాషణలు అద్భుతమని చెప్పాడు రణ్‌వీర్. ‘మా ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్స్ చాలా గొప్పగా ఉన్నాయి. బిగ్ బ్రదర్ మహేశ్‌తో వర్క్ చేయడం గర్వంగా ఉంది’ అని రణ్‌వీర్ తెలిపాడు. మీతో పనిచేయడం నాకు కూడా గొప్ప వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అని మహేశ్ ఇన్‌స్టా వేదికగా తెలిపారు. కాగా, బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు సూపర్ స్టార్స్ స్క్రీన్ షేరింగ్ పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తుండగా, రణ్‌వీర్.. రోహిత్‌శెట్టి దర్శకత్వంలో ‘సర్కస్’, దివ్యాంగ్ తక్కర్ డైరెక్షన్‌లో ‘జయేశ్‌భాయి జోర్దార్’ చిత్రాల్లో నటిస్తున్నాడు.


Next Story

Most Viewed