కేంద్ర నిధులు సద్వినియోగం చేయండి: రంజిత్

by Shyam |

<p>కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా చేపట్టాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ, మైనింగ్ ద్వారా వచ్చే నిధులను సకాలంలో వినియోగించడం ద్వారా జిల్లా అభివృద్ధి సాధ్యమన్నారు. అటు గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎంపీ రంజిత్ అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి పథంలో [&hellip;]</p>

కేంద్ర నిధులు సద్వినియోగం చేయండి: రంజిత్
X

కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా చేపట్టాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ, మైనింగ్ ద్వారా వచ్చే నిధులను సకాలంలో వినియోగించడం ద్వారా జిల్లా అభివృద్ధి సాధ్యమన్నారు. అటు గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎంపీ రంజిత్ అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Next Story