రెచ్చిపోయిన వర్మ.. ‘సిరివెన్నెల’కు కిస్ ఇస్తూ ఏం చేశారంటే..? ( వీడియో)

by  |
రెచ్చిపోయిన వర్మ.. ‘సిరివెన్నెల’కు కిస్ ఇస్తూ ఏం చేశారంటే..? ( వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో వివాదస్పద డైరెక్టర్ అని చెప్పగానే అందరికీ త్వరగా గుర్తుకు వచ్చేది రాంగోపాలవర్మ మాత్రమే. వివాదాలు సృష్టించడంలోనే కాదు వాటికి వివరణ ఇవ్వడంలో వర్మను మించిన తోపులేరు అన్నది వాస్తవం. ఎవరేమనుకున్నా తనకు నచ్చినట్లు తాను బతకడమే వర్మ ఫిలాసఫీ. అయితే తాజాగా వర్మ ఓ వీడియోను విడుదల చేశారు.

వీడియో ఏంటీ అనుకుంటున్నారా.. రాంగోపాల్ వర్మ ఏం చేసినా కాస్త డిఫరెంట్‌గా చేస్తారు. అలానే ఇటీవల మరణించిన సిరివెన్నెల సీతారామశాస్త్రీకి ఓ ముద్దు పెడుతూ వీడియోను విడుదల చేశాడు. ఈ వీడియోలో సిరివెన్నెల అంటే తనకు ఎంతో ఇష్టమని, తన కెరియర్‌లో తనకు ఇష్టమైన సాంగ్ ఏదైనా ఉందా అంటే అది సిరివెన్నెల రాసిన పాటనే అని తెలిపారు. “ఒప్పు కోవ‌ద్దు రా.. ఓట‌మి ” అనే పాటను పాడుతూ అదే తనకు ఇష్టమైన పాట అని పేర్కొన్నారు. దాదాపు 5 నిమిషాల ఉన్న ఈ వీడియో‌లో రామ్ గోపాల్ వ‌ర్మ సిరి వెన్నెల గురించి చెబుతూ.. ఒప్పుకోవద్దుర ఓటమి అనే పాటను తనదైన స్టైల్‌లో పాడారు. అంతే కాకుండా సిరి వెన్నెల సీతారామా శాస్త్రి పొటోకు ముద్దుకూడా పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. దీన్ని చూసిన వారందరూ వర్మ సాంగ్ చాలా బాగా పాడారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Next Story

Most Viewed