‘రంగ్ దే’ రిలీజ్ డేట్ ఫిక్స్

by  |
‘రంగ్ దే’ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : హీరో నితిన్, కీర్తి సురేష్ రొమాంటివ్ లవ్ స్టోరీ ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వస్తున్న సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా.. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న సినిమా నుంచి అప్‌డేట్ ఇచ్చారు ఫిల్మ్ మేకర్స్. న్యూ ఇయర్ కానుకగా మ్యూజిక్ బిట్ వీడియో రిలీజ్ చేసిన మూవీ యూనిట్.. సినిమాను మార్చి 26న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ‘గివ్ మి సమ్ లవ్’ అంటూ వచ్చేస్తున్న మూవీని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని.. కీర్తి, నితిన్‌ల జోడి ఫ్రెష్ ఫీలింగ్‌తో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తుందని నమ్ముతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహకులు కాగా.. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు.



Next Story

Most Viewed