ఓల్డ్ మ్యాన్ గెటప్‌లో రణ్‌బీర్.. ఫొటోస్ వైరల్

by  |
ఓల్డ్ మ్యాన్ గెటప్‌లో రణ్‌బీర్.. ఫొటోస్ వైరల్
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ఓల్డ్ మ్యాన్ గెటప్‌లో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఏషియన్ పెయింట్స్‌కు సంబంధించిన న్యూ యాడ్‌లో రణ్‌బీర్ రెండు గెటప్స్‌లో కనిపించబోతున్నారు. వృద్ధుడు, యంగ్ ఏజ్ పర్సన్‌గా ఈ యాడ్‌లో మస్త్ ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వనుండగా.. ఇందుకు సంబంధించిన బిహైండ్ ది సీన్స్ పిక్స్ షేర్ చేశారు మేకప్ ఆర్టిస్ట్.

మేకప్‌కు ఉన్న గొప్పతనాన్ని వివరిస్తూ అభిమానులతో ఈ ఫొటోలను పంచుకున్నారు. ఇలాంటి లిటిల్ థింగ్స్.. క్యారెక్టర్‌కు డెప్త్ యాడ్ చేస్తాయని, క్యారెక్టర్‌కు పర్‌ఫెక్షన్‌ను తీసుకొస్తాయని అన్నారు. దీని కోసం రణ్‌బీర్ చాలా సపోర్ట్ చేశారని తెలిపారు. గంటల పాటు హార్డ్ వర్క్, పేషెన్స్.. చివరకు గొప్ప ఫలితాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. యాడ్‌కు సంబంధించిన గ్లింప్స్ కూడా షేర్ చేశారు.


Next Story