పవన్‌తో రానా యాక్షన్ సీక్వెన్స్ షురూ

by  |
పవన్‌తో రానా యాక్షన్ సీక్వెన్స్ షురూ
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం రీమేక్ షూటింగ్ ప్రారంభమైంది. జనవరి 25 నుంచే పవన్ షూటింగ్‌లో పాల్గొనగా..హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో జరుగుతున్న యాక్షన్ సీక్వెన్స్‌లో రానా కూడా జాయిన్ అయ్యారు. వచ్చే నెల 2 వరకు రెగ్యులర్ షూటింగ్ జరగనుండగా..సముద్రఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమాకు సాగర్ కె.చంద్ర దర్శకులు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.



Next Story

Most Viewed