- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘనంగా రానా – మిహిక వివాహ మహోత్సవం
<p>దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి ఇంటివాడయ్యాడు. వేదమంత్రాల నడుమ అగ్ని సాక్షిగా శనివారం రా. 8:30 గంటలకు మిహిక బజాజ్ మెడలో మూడు ముళ్లు వేశాడు రానా. రామానాయుడు స్టూడియోలో జరిగిన వివాహ మహోత్సవానికి కేవలం 30 మంది బంధు మిత్రులు హాజరుకాగా.. ఏడడుగులు వేసి మిహికను తన జీవితంలోకి ఆహ్వానించాడు రానా. లాక్ డౌన్ లో తన ప్రియురాలిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసిన రానా.. కుటుంబ సభ్యుల […]</p>

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి ఇంటివాడయ్యాడు. వేదమంత్రాల నడుమ అగ్ని సాక్షిగా శనివారం రా. 8:30 గంటలకు మిహిక బజాజ్ మెడలో మూడు ముళ్లు వేశాడు రానా. రామానాయుడు స్టూడియోలో జరిగిన వివాహ మహోత్సవానికి కేవలం 30 మంది బంధు మిత్రులు హాజరుకాగా.. ఏడడుగులు వేసి మిహికను తన జీవితంలోకి ఆహ్వానించాడు రానా.
లాక్ డౌన్ లో తన ప్రియురాలిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసిన రానా.. కుటుంబ సభ్యుల మద్దతుతో ఘనంగా వివాహం చేసుకున్నాడు. తెలుగుతో పాటు మరాఠీ సంప్రదాయం ప్రకారం వివాహం జరగ్గా… పెళ్లికి విచ్చేసిన అతిథులకు తెలుగు, మరాఠీ వంటకాలతో రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేసింది దగ్గుబాటి కుటుంబం. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే అట్టహాసంగా రానా వివాహ తంతు జరగ్గా.. అల్లు అర్జున్, సమంత, నాగ చైతన్యతో పాటు పలువురు సెలబ్రిటీలు వివాహానికి హాజరయ్యారు.






