- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా నివారణలో రాంకీ ఎన్విరో
<p>దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్ -19 మహమ్మారి విజృంభిస్తోన్న వేళ అవసరమైన వ్యర్థ నిర్వహణ సేవలను చేపట్టేందుకు రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ లిమిటెడ్ (రీల్) కట్టుబడి ఉందని ఆ సంస్థ పునరుద్ఘాటించింది. పర్యావరణ విభాగంలో ప్రపంచంలో అగ్రగామి సంస్థగా ఉన్న రాంకీ ఎన్విరో.. మనదేశంలోని 25 ప్రధాన నగరాల్లో 15 వేల మందితో కార్యకలాపాలు నిర్వహిస్తోందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 30 వేల హెల్త్‌కేర్ కేంద్రాల ద్వారా 3.40 లక్షల బెడ్స్‌తో సేవలందిస్తోందని అందులో తెలిపారు. […]</p>

దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్ -19 మహమ్మారి విజృంభిస్తోన్న వేళ అవసరమైన వ్యర్థ నిర్వహణ సేవలను చేపట్టేందుకు రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ లిమిటెడ్ (రీల్) కట్టుబడి ఉందని ఆ సంస్థ పునరుద్ఘాటించింది. పర్యావరణ విభాగంలో ప్రపంచంలో అగ్రగామి సంస్థగా ఉన్న రాంకీ ఎన్విరో.. మనదేశంలోని 25 ప్రధాన నగరాల్లో 15 వేల మందితో కార్యకలాపాలు నిర్వహిస్తోందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 30 వేల హెల్త్‌కేర్ కేంద్రాల ద్వారా 3.40 లక్షల బెడ్స్‌తో సేవలందిస్తోందని అందులో తెలిపారు. ప్రతి రోజు 13 వేల టన్నుల వ్యర్థాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన ఆదేశాల ప్రకారం డిస్పోజల్ చేయడం ద్వారా ప్రజల ఆరోగ్య రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని సంస్థ స్పష్టం చేసింది.
‘ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వానికి, సమాజానికి మద్ధతుగా నిలిచినందుకు గర్వంగా ఉందని ‘రాంకీ ఎన్విరో’ సీఈఓ గౌతమ్ రెడ్డి ప్రకటించారు. కరోనా స్టేజ్-3లోకి ప్రవేశించకుండా చేయడంలో భాగంగా వ్యర్థాల సేకరణ, నిర్వహణ సేవలను కొనసాగించే అవకాశం తమకు దక్కిన గౌరవమని ఆయన పేర్కొన్నారు.
Tags: Waste Management, Ramky Enviro, Corona






