'అహం బ్రహ్మాస్మి': మనోజ్‌పై ఫస్ట్ క్లాప్ ఇచ్చిన చెర్రీ

by  |
అహం బ్రహ్మాస్మి: మనోజ్‌పై ఫస్ట్ క్లాప్ ఇచ్చిన చెర్రీ
X

వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొని కోలుకున్న హీరో మంచు మనోజ్ చాలా కాలం తర్వాత సినిమా చేస్తున్నాడు. ‘మనోజ్ మంచు ఆర్ట్స్’ నిర్మాణ సంస్థను నెలకొల్పిన మనోజ్… సినీ అమ్మ మరో సినిమాతో మళ్లీ నీ దగ్గరకు వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. ఈ క్రమంలోనే ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాను ప్రకటించిన మనోజ్… ఫస్ట్ లుక్‌తో అమితంగా ఆకట్టుకున్నారు. ఫస్ట్ లుక్‌లోనే త్రీ షేడ్స్ చూపించిన మనోజ్…. సినిమా లాంచింగ్‌కు తన మిత్రుడు మెగాపవర్ స్టార్‌ రామ్ చరణ్‌కు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికాడు.

సినిమా లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చెర్రీ… ముహూర్తపు సన్నివేశానికి హీరో మనోజ్‌పై ఫస్ట్ క్లాప్ ఇచ్చి సినిమాను లాంచ్ చేశారు. పూజా కార్యక్రమంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్నతో పాటు మంచు కుటుంబసభ్యులు హాజరు కాగా… అంతకు ముందు సినిమా లాంచింగ్‌కు హాజరయ్యేందుకు వచ్చిన చెర్రీకి ఘన స్వాగతం పలికింది ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రయూనిట్. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా … నటుడు సముతిరఖని, ప్రియాభవాని శంకర్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నట్లు ప్రకటించింది మూవీ టీం. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటిస్తామని వెల్లడించింది.

కాగా సినిమా లాంచింగ్ ఈవెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. షూటింగ్ ప్రారంభ కార్యక్రమానికి చెర్రీ హాజరు కాగా…. #SeethaRAMaRajuCHARAN హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండింగ్‌లో ఉంది.

Tags: MM Arts, Manchu Manoj, Ram Charan, Aham Brahmasmi, Launching



Next Story

Most Viewed