నూతన మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలుగా రామసహయం మాధవి రెడ్డి

by Sridhar Babu |   (  Updated:2021-08-14 09:08:21  IST  )

<p>దిశ, పాలేరు: తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా రామసహయం మాధవిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ జీ ఉత్తర్వులు జారీ చేయడంతో, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా మొగిలి రావు ద్వారా శనివారం నియామక పత్రాలు అందుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రక్షాళనలో భాగంగా నూతన మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలుగా రామసహయం మాధవిరెడ్డిని నియమించినట్లు తెలిపారు. మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఎంపిక విషయంలో పార్టీ వర్గాలు చాలానే [&hellip;]</p>

నూతన మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలుగా రామసహయం మాధవి రెడ్డి
X

దిశ, పాలేరు: తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా రామసహయం మాధవిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ జీ ఉత్తర్వులు జారీ చేయడంతో, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా మొగిలి రావు ద్వారా శనివారం నియామక పత్రాలు అందుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రక్షాళనలో భాగంగా నూతన మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలుగా రామసహయం మాధవిరెడ్డిని నియమించినట్లు తెలిపారు. మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఎంపిక విషయంలో పార్టీ వర్గాలు చాలానే కసరత్తు చేశారు.

జాతీయ మహిళా అధ్యక్షురాలు సుశ్మితా దేవ్‌ కొందరిని ఇంటర్వ్యూ చేసి చివరకు మాధవిరెడ్డి వైపే సుశ్మితా దేవ్ మొగ్గుచూపినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొనడంతో పాటు మహిళా సమస్యలను పరిష్కరించే సత్తా ఉండటంతో మాధవిరెడ్డికే పదవి దక్కినట్లు తెలుస్తోంది. మాధవిరెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ మహిళా నాయకురాలుగా సేవలందించారు. పార్టీకి విధేయురాలు, కష్టపడే తత్వం ఉన్న నేత కావడంతోనే కాంగ్రెస్ అధిష్ఠానం ఆమె పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మాధవిరెడ్డి మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా పని చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తనను ఉపాధ్యక్షురాలుగా ప్రకటించినందుకు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత మొగిలి రావుకి, సుస్మితా దేవ్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story