టేక్ ఏ బో.. రామరాజు ఫర్ భీమ్!

by  |
టేక్ ఏ బో.. రామరాజు ఫర్ భీమ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఫస్ట్ ఆఫ్ ఆల్.. టేక్ ఏ బో జక్కన్న. ఇద్దరు పవర్‌ఫుల్ కథానాయకులు కలిస్తే ఆడియన్స్ ఇంత గొప్ప శాటిస్‌ఫాక్షన్ పొందొచ్చని.. నీరు, నిప్పు కలిస్తే ఇన్ని వండర్స్ చూడొచ్చని నిరూపించాడు. జక్కన్న పుణ్యమా అని ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ద్వారా ఈ గొప్ప అనుభూతిని పొందే అవకాశం దక్కింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ తేజ్ నిప్పుతో వస్తే.. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నీరుతో వచ్చాడు. ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో రివీల్ అయిన చరణ్ లుక్ తారక్ వాయిస్‌తో ఎంత హై ఇంటెన్సిటీ పొందిందో.. అదే మాదిరిగా చరణ్ బేస్ వాయిస్‌తో తారక్‌కు ‘రామరాజు ఫర్ భీమ్’ అంటూ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. ప్రతీ పదం చరణ్ వాయిస్‌తో మరింత పవర్ ఫుల్‌గా ఉండగా.. వినే చెవులకు, చూసే కళ్లకు మరో లోకంలో ఉన్న అనుభూతిని పంచుతూ.. ఒళ్లంతా గూస్ బంప్స్ వచ్చేలా చేసింది.

‘వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి.. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి.. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ.. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ. నా తమ్ముడు.. గోండు బెబ్బులి.. కొమురం భీమ్’ అంటూ కొమురం భీమ్ 119వ జయంతిన రిలీజైన తారక్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తారక్ మేకోవర్ & యాక్టింగ్ పీక్స్‌లో ఉండగా, ‘నా తమ్ముడు.. గోండు బెబ్బులి’ అనే టైమింగ్‌లో తారక్ రోరింగ్ సీన్ వేరే లెవల్‌లో ఉంది. శత్రువులను వేటాడేందుకు ఆవేశంతో చిరుతపులిలా పరుగులు పెట్టిన బెబ్బులి.. అదే సమయంలో తెలుపు దుస్తులు ధరించి ప్రశాంతతకు మారుపేరుగా భీమ్‌ దర్శనమివ్వడం కూడా ఆయనకే చెల్లింది.

మొత్తానికి ఇద్దరు టాలీవుడ్ హీరోలు జక్కన్నతో కలిసి వండర్స్ క్రియేట్ చేసేందుకు రెడీగా ఉన్నారని పెర్ఫెక్ట్‌గా అర్థం అవుతుండగా.. ముఖ్యంగా విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కేవలం మూడు నిమిషాల్లో రెండు లక్షల వ్యూస్ పొందిన ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉండగా.. ఆ విజువల్స్ చూసాక లైఫ్‌లో ఫస్ట్ టైమ్ సినిమా కోసం వెయిటింగ్ చేయడం నిజంగా కష్టంగా ఉందంటున్నారు ఫ్యాన్స్.


Next Story

Most Viewed