రోజా ముక్కు పగలగొట్టిన సీనియర్ అసిస్టెంట్

6

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న రోజాపై బోధన్ సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ దాడి చేశాడు. గతంలో బోధన్ మున్సిపల్ ఆఫీస్‌లో రామకృష్ణ దగ్గర జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన రోజా ఇటీవల బదిలీ అయ్యింది. అప్పటి నుంచి రామకృష్ణ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిప్ట్ చేయకపోవడంతో సోమవారం ఉదయం కామారెడ్డి కార్యాలయం వెళ్లి రోజాపై దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమె ముక్కుకు తీవ్ర గాయం కావడంతో ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణపై రోజా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.