- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లొంగిపోండి.. మావోయిస్టులకు పిలుపునిచ్చిన రామగుండం సీపీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, బెల్లంపల్లి: అడవి బాటను వీడి మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ (ఆనంద్) కుటుంబ సభ్యులను కలిసిన ఆయన పండ్లు, దుస్తులు అందజేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సాధ్యం కాని సిద్ధాంతాలు, ఆశయాలతో అడవిలో ఉంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు తప్పా వారు సాధించేదేమి లేదన్నారు. అజ్ఞాత […]</p>

X
దిశ, బెల్లంపల్లి: అడవి బాటను వీడి మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ (ఆనంద్) కుటుంబ సభ్యులను కలిసిన ఆయన పండ్లు, దుస్తులు అందజేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సాధ్యం కాని సిద్ధాంతాలు, ఆశయాలతో అడవిలో ఉంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు తప్పా వారు సాధించేదేమి లేదన్నారు. అజ్ఞాత జీవనం గడుపుతున్న మావోయిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని.. ప్రస్తుతం కరోనా వైరస్ వచ్చి అడవిలో ఉంటున్న వారు జనజీవన స్రవంతిలో కలిస్తే.. మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. కనీసం ఇప్పటికైనా లొంగిపోయి కుటుంబంతో సంతోషంగా గడపాలని రామగుండం పోలీస్ కమిషనర్ కోరారు.
Next Story






