క్రేజీ కాంబో.. ‘జెర్సీ’ డైరెక్టర్‌తో చెర్రీ?

by  |
క్రేజీ కాంబో.. ‘జెర్సీ’ డైరెక్టర్‌తో చెర్రీ?
X

దిశ, సినిమా: మెగా పవర్‌స్టార్ రాంచరణ్ తేజ్ ‘RRR’ తర్వాత చేయబోయే సినిమా ఇప్పటికీ ఖరారవ్వలేదు. పలువురు దర్శకుల పేర్లు వినపడినప్పటికీ, నెక్స్ట్ మూవీ ఎవరి డైరెక్షన్‌లో ఉంటుందన్న విషయమై స్పష్టత రాలేదు. తాజాగా దిల్ రాజు బ్యానర్‌లో డైరెక్టర్ శంకర్‌తో మూవీ ఉంటుందని వార్తలు వచ్చినా, అఫిషియల్‌గా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఇదిలా ఉండగా చెర్రీ నెక్స్ట్ మూవీపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సర్క్యులేట్ అవుతుండటం విశేషం.

‘మళ్లీ రావా’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో ‘జెర్సీ’ మూవీ తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు. బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అవుతున్న ఈ చిత్రానికి కూడా ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, డైరెక్టర్ గౌతమ్ ఇటీవలే చరణ్‌కు ఓ కథ వినిపించగా.. స్టోరీలైన్ ఆయనకు బాగా నచ్చి ఓకే చెప్పారని సమాచారం. అంతేకాదు ‘మాస్టర్’ ఫేమ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజు కూడా చెర్రీకి స్టోరీ లైన్ చెప్పినట్లు వార్తలొచ్చాయి. దీంతో చరణ్ నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారా? అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లోనూ కీ రోల్ పోషిస్తున్న చెర్రీ నెక్స్ట్ మూవీ ఎవరి డైరెక్షన్‌లో ఉంటుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.


Next Story

Most Viewed