హీరో రామ్ మరో సంచలన ట్వీట్ 

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-17 06:59:13  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: హీరో రామ్ తన వరస ట్వీట్లతో సంచలనం సృష్టిస్తున్నారు. ఏసీపీ వార్నింగ్ తో స్వర్ణ ప్యాలస్ ఘటనపై ఇక ట్వీట్ చేయనంటూ రామ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి కొంతమంది నెటిజెన్లు కామెంట్ చేస్తూ కుల ప్రస్తావన తెచ్చారు. దీంతో వారందరికీ కౌంటర్ గా రామ్ చేసిన కుల వైరస్ ట్వీట్ సంచలనంగా మారింది. &#8220;నా ప్రియమైన సోదరులకు, సోదరీమణులకు&#8230; కరోనా కంటే కుల వైరస్ చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఇది [&hellip;]</p>

హీరో రామ్ మరో సంచలన ట్వీట్ 
X

దిశ, వెబ్ డెస్క్: హీరో రామ్ తన వరస ట్వీట్లతో సంచలనం సృష్టిస్తున్నారు. ఏసీపీ వార్నింగ్ తో స్వర్ణ ప్యాలస్ ఘటనపై ఇక ట్వీట్ చేయనంటూ రామ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి కొంతమంది నెటిజెన్లు కామెంట్ చేస్తూ కుల ప్రస్తావన తెచ్చారు. దీంతో వారందరికీ కౌంటర్ గా రామ్ చేసిన కుల వైరస్ ట్వీట్ సంచలనంగా మారింది.

“నా ప్రియమైన సోదరులకు, సోదరీమణులకు… కరోనా కంటే కుల వైరస్ చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఇది దానికంటే ప్రమాదకరమైన అంటువ్యాధి. దీనిని సైలెంట్ గా స్ప్రెడ్ చేసేవాళ్ళు మిమ్మల్ని కూడా అందులోకి లాగడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటివాళ్ళకి దూరంగా ఉండండి. మనందరం కలిసి దానిని జయిద్దాం…” అంటూ ట్వీట్ చేశారు.

Next Story