నో సెలబ్రేషన్స్.. అభిమానుల ఆరోగ్యమే ముఖ్యం: రామ్

by  |
నో సెలబ్రేషన్స్.. అభిమానుల ఆరోగ్యమే ముఖ్యం: రామ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని..‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఇస్మార్ట్ హిట్ అందుకున్నాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా రామ్ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కాగా.. ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ప్రస్తుతం రామ్ ‘రెడ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులకు కిక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఫస్ట్ లుక్, టీజర్ అదిరిపోగా.. ఈ మధ్యే రిలీజ్ అయిన ఈ చిత్రంలోని ‘నువ్వే నువ్వే’ సాంగ్ మేకింగ్ వీడియో ఆకట్టుకుంది. అయితే మే 15న రామ్ పుట్టినరోజు కాగా.. ఇస్మార్ట్ శంకర్ హిట్ ఊపులో ఉన్న ఫ్యాన్స్.. ఈ సారి రామ్ బర్త్ డేను భారీగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారు.

కానీ కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్‌ను కోరాడు రామ్. ‘నా ప్రియమైన అభిమానులకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. మీరే నా సంతోషం, నా ఎనర్జీ, నా ప్రాణం.. అంతకు మించి నా బాధ్యత. మీ ఆరోగ్యం, మీ సంతోషమే నాకు ముఖ్యం కాబట్టి .. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వేడుకలు జరపకూడదని కోరాడు. సామాజిక దూరమే అందరికీ రక్ష అని.. దాన్ని పాటించడమే మీరు నాకిచ్చే అసలైన పుట్టినరోజు కానుక’ అని తెలిపాడు రామ్.

Next Story

Most Viewed