మాటల మాంత్రికుడితో రామ్ పోతినేని..

by  |
మాటల మాంత్రికుడితో రామ్ పోతినేని..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ‘రెడ్’ సినిమాతో సంక్రాంతికి సందడి చేసేందుకు రెడీ అయిపోయాడు. జనవరి 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న రామ్.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌‌‌తో మూవీ ఉండబోతుందన్న రూమర్స్‌ నిజమేనని స్పష్టం చేశాడు.

కానీ చిత్రం ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనేది చెప్పలేమన్నాడు. కాగా డైనమిక్ డైరెక్టర్‌ పూరి కాంబినేషన్‌లో వచ్చిన రామ్‌కు ఇస్మార్ట్ ట్యాగ్‌ ఇచ్చేయగా.. త్రివిక్రమ్ మూవీ ఎలాంటి ట్యాగ్ యాడ్ చేయబోతుందో అంటున్నారు ఫ్యాన్స్. మాటల మాంత్రికుడి సినిమా రామ్‌ కెరియర్‌కు మరింత ఎనర్జీ ఇచ్చే చాన్స్ ఉండగా.. ఆల్రెడీ అఫిషియల్‌గా అనౌన్స్ అయిన త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యాకే.. ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.


Next Story

Most Viewed